మా మొర ఆలకించండి... జెట్‌ను కాపాడండి - శివాజీ విమానాశ్రయం
🎬 Watch Now: Feature Video
ఆర్థిక సంక్షోభంతో తాత్కాలికంగా మూత పడిన జెట్ ఎయిర్వేస్ను పునరుద్ధరించాలని సంస్థ ఉదోగులు ఆందోళనకు దిగారు. ముంబయిలోని ఛత్రపతి శివాజీ విమానాశ్రయం వద్ద ధర్నా చేపట్టారు. భారత్‌కు గర్వకారణమైన జెట్ ఎయిర్వేస్ను కాపాడాలి అనే నినాదాలతో ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ నిరసన కార్యక్రమంలో జెట్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రుణ భారం పెరిగిపోయిన కారణంగా జెట్ యాజమాన్య బాధ్యతలు చేపట్టిన ఎస్బీఐ నేతృత్వంలోని రుణదాతల కన్సార్షియం... సంస్థను గట్టెక్కించలేకపోయింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 17 అర్ధ రాత్రి నుంచి సేవలు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది జెట్. జెట్ ఉద్యోగుల్లో కొంత మందిని స్పైస్‌జెట్ సహా ఇతర విమాన సంస్థలు చేర్చుకోవడం గమనార్హం.