పోటెత్తిన వరద.. కొట్టుకుపోయిన గోవులు - మహాగావ్లో కొట్టుకుపోయిన ఆవులు
🎬 Watch Now: Feature Video
మహారాష్ట్రలోని యవత్మాల్లో కురిసిన భారీ వర్షాలు (Floods In Maharashtra) స్థానిక పశుపోషకులకు తీరని నష్టాన్ని కలిగించాలి. మహాగావ్ తాలూకాలోని బేల్దారీ గ్రామంలో వరద నీరు పోటెత్తడం వల్ల చెరువులో నీరు కట్టలు తెంచుకుంది. దీంతో సాయంత్రం ఇంటికి తిరుగు పయనమైన 60 నుంచి 70 ఆవులు వరద నీటికి కొట్టుకుపోయాయి. వీటిలో కొన్నింటిని మాత్రమే కాపాడగలిగారు పశువులకాపరులు. ఈ ఘటనను అక్కడే ఉన్న కాపరి ఫోన్లో వీడియో తీశారు. ఈ దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.