గొలుసు దొంగకు బడిత పూజ చేయించిన మహిళ..! - police
🎬 Watch Now: Feature Video
దిల్లీలో ఓ మహిళ, ఆమె కూతురు సాహసోపేతంగా వ్యవహరించారు. గొలుసు కొట్టేద్దామని బైక్పై వచ్చిన దొంగలను ధైర్యంగా పట్టుకున్నారు. తల్లీ కూతుర్లు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా.. బైక్పై వచ్చిన ఇద్దరు దొంగల్లో ఒకడు మహిళ మెడలోని గొలుసును లాక్కున్నాడు. అప్రమత్తంగా ఉన్న ఆమె వెంటనే అతడిని పట్టుకుని వదల్లేదు. స్థానికులు వచ్చి దొంగపై దాడి చేశారు. అనంతరం పోలీసులు ఇద్దరు గొలుసు దొంగలను అరెస్టు చేశారు. దిల్లీలోని నంగోలోయ్లో శనివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Last Updated : Sep 29, 2019, 7:48 AM IST