మాస్క్​ పెట్టుకోమన్నందుకు.. మహిళా పోలీస్​ను తోసేసి.. - వైరల్​ వార్తలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 29, 2021, 9:09 AM IST

Ruckus over not wearing a mask: ఒమిక్రాన్​ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆంక్షలు కఠినతరం చేసింది మధ్యప్రదేశ్​ ప్రభుత్వం. దేవాస్​ నగరంలోని ఏబీ రోడ్​లో తనిఖీలు చేపట్టారు పోలీసులు. ఈ క్రమంలో మాస్క్ లేకుండా స్కూటీపై వచ్చిన జాగృతి మాధ్వాని మిశ్రా అనే మహిళను ఆపారు. మాస్క్​ ధరించాలని.. లేదంటే చలానా విధిస్తామని చెప్పారు. దీంతో ఆగ్రహించిన ఆ మహిళ పోలీసులతో వాగ్వాదానికి దిగింది. ఓ మహిళా పోలీసును బలంగా నెట్టివేయటం వల్ల ఆమె కిందపడిపోయింది. అక్కడే ఉన్న మరో కానిస్టేబుల్ చెప్పు తీయటం చర్చనీయాంశమైంది. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.