Viral Video: క్రికెట్ బ్యాట్‌తో యువకులపై మహిళ దాడి - హరియాణా పానీపత్ వార్తలు
🎬 Watch Now: Feature Video
హరియాణా పానీపత్ జిల్లా షేరా గ్రామంలో ఓ మహిళ వీరంగం సృష్టించింది. తన వాహనాన్ని కారుతో ఢీ కొట్టారన్న ఆరోపణలతో ఇద్దరు యువకులపై దాడికి దిగింది. అనంతరం కుటుంబసభ్యులను తీసుకొచ్చిన ఆమె.. యువకులపై క్రికెట్ బ్యాట్‌తో దాడి చేసింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.