ప్రవచనాలు చెబుతూనే ప్రాణం వదిలిన స్వామీజీ.. పుట్టిన రోజు నాడే... - పుట్టిన రోజు నాడే ప్రాణం వదిలిన స్వామీజీ
🎬 Watch Now: Feature Video
కర్ణాటకలో హృదయవిదారక ఘటన జరిగింది. బెళగావి జిల్లాలోని బలోబల మఠం పీఠాధిపతి అయిన సంగనబసవ మహా స్వామీజీ ప్రసంగిస్తూనే ప్రాణాలు కోల్పోయారు. ఈ నెల 6న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. తన జన్మదిన వేడుకల సందర్భంగా పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులను ఉద్దేశించి స్వామీజీ ప్రసంగిస్తున్నారు. ఆ సమయంలో హఠాత్తుగా గుండెపోటు రాగా ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయారు.