Ducati XDiavel V4 Unveiled: ప్రీమియం మోటార్‌సైకిల్ తయారీ సంస్థ డుకాటీ తన కొత్త 'డుకాటీ ఎక్స్‌డయావెల్ V4 (Ducati XDiavel V4)'ను గ్లోబల్‌గా ప్రవేశపెట్టింది. ఈ కొత్త మోటార్‌సైకిల్ ముఖ్య భాగాలను టూరింగ్- ఫోకస్డ్ అండ్ లెస్ స్పోర్టి వెర్షన్ అయిన 'డుకాటి డయావెల్' మోడల్ నుంచి తీసుకున్నారు. అయితే దీని రైడింగ్ పోస్టర్లో కొన్ని మార్పులు చేశారు. కానీ దీనిలో చాలా వరకు మెకానికల్ భాగాలు, స్ట్రైలింగ్ ఎలిమెంట్స్ మునుపటిలాగానే ఉంటాయి.
డుకాటీ 'XDiavel V4' డిజైన్: ఈ కొత్త మోటార్‌సైకిల్‌లో అతిపెద్ద మార్పు ఏంటంటే ఇది దీని ప్రీవియస్ మోడల్‌కు భిన్నంగా ఇది చైన్ డ్రైవ్ సిస్టమ్‌ను ఉపయోగిస్తుంది. ఇక దీని డిజైన్ విషయానికి వస్తే ఈ కొత్త బైక్ చూసేందుకు 'డయావెల్ V4' మాదిరిగానే ఉంటుంది. అయితే దీనిలో కొన్ని మార్పులు కూడా కన్పిస్తాయి. ఈ ఛేంజెస్‌లో బైక్ ముందు భాగంలోని లెస్ ప్రోమినెంట్ ఎయిర్ ఇన్లెట్స్, కొత్తగా రూపొందించిన అల్లాయ్ వీల్స్, రీడిజైన్డ్ టెయిల్ సెక్షన్ వంటివి ఉంటాయి.
అయితే ఈ కొత్త 'డుకాటి ఎక్స్‌డయావెల్ V4' బైక్‌లో మరింత ఎక్కువ కుషింగ్తో కూడిన విశాలమైన సీటు ఉంది. అలాగే రైడర్ ట్రయాంగిల్లో కూడా కొన్ని మార్పులు ఉన్నాయి. వీటిలో వెడల్పుగా, రియర్-సీట్ హ్యాండిల్‌బార్స్, మరింత సౌకర్యవంతమైన రైడింగ్ పోస్టర్ కోసం ఫార్వర్డెడ్- సీట్ ఫుట్‌పెగ్స్ వంటివి ఉన్నాయి. ఇక దీని సీటు హైట్ 770 mm. ఇది డయావెల్ V4 కంటే 20 mm తక్కువ. అయితే దీని బరువు (వెయిట్) 'డయావెల్ V4' కంటే 6 కిలోలు ఎక్కువ.

ఫీచర్లు: ఈ బైక్‌లో స్టాండర్డ్ 'డయావెల్' మాదిరిగానే 6.9-అంగుళాల TFT డిస్ప్లే ఉంది. ఇక ఎలక్ట్రానిక్స్ విషయానికి వస్తే ఇందులో కార్నరింగ్ ABS, ట్రాక్షన్ కంట్రోల్, రైడ్ మోడ్స్, వీలీ కంట్రోల్ అండ్ క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
పవర్‌ట్రెయిన్: ఇది 1,158cc V4 ఇంజిన్‌ను కలిగి ఉంది. ఈ ఇంజిన్ 170 bhp పవర్, 126Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 'డయావెల్ V4' మాదిరిగానే ఉంటుంది. ఇక ఈ ఇంజిన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతయి బై-డెరెక్షనల్ క్విక్‌షిఫ్టర్‌తో వస్తుంది.
హార్డ్‌వేర్: ఈ కొత్త మోటార్‌సైకిల్ హార్డ్‌వేర్ గురించి మాట్లాడుకుంటే దాని సస్పెన్షన్ సెటప్.. 120 mm ట్రావెల్‌తో 50 mm అప్‌సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్‌లను, 145 mm ట్రావెల్‌తో రియర్ మోనోషాక్‌ను ఉపయోగిస్తుంది. దీన్ని బైక్ రెండు చివర్లలో పూర్తిగా అడ్జస్ట్ చేయొచ్చు. ఇక బ్రేకింగ్ కోసం బైక్ ముందు భాగంలో బ్రెంబో స్టైల్మా 4-పిస్టన్ కాలిపర్‌లతో డ్యూయల్ 330 mm డిస్క్ బ్రేక్‌లు, వెనక భాగంలో ఒకే 265 mm డిస్క్‌ను ఏర్పాటు చేశారు.
అధునాతన టెక్నాలజీతో 'BYD సీలియన్ 7' SUV లాంఛ్- సింగిల్ ఛార్జ్‌తో 567 కి.మీ రేంజ్!
ప్రీమియం స్లిమ్ డిజైన్, ZEISS కెమెరాలతో వివో కొత్త ఫోన్- మిడ్ రేంజ్లో టాప్ ఇదే!
గగన్‌యాన్‌తో మరో అద్భుతానికి ఇస్రో రెడీ!- ఈ ఏడాదే మొదటి ఫ్లైట్ లాంఛ్- షెడ్యూల్ ఇదే!