బారికేడ్‌పై నుంచి జంప్ చేసిన ఏనుగు- కుక్క పిల్లల్ని దత్తత తీసుకున్న కోతి! - కుక్క పిల్లలను పెంచుతోన్న కోతి
🎬 Watch Now: Feature Video
కర్ణాటక, మైసూర్‌లోని బండిపుర జాతీయ పార్క్‌లోని ఓంకార్ జోన్లో ఓ గజరాజు పెద్ద సాహసమే చేసింది. వన్యమృగాలు జనావాసాల్లోకి రాకుండా ఏర్పాటు చేసిన బారికేడ్‌ను ఎంతో జాగ్రత్తగా దాటింది. ఈ దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. మరో సంఘటనలో.. ఓ కోతి జాతివైరం మరిచి రెండు కుక్క పిల్లలను సొంత బిడ్డల్లా కాపాడుతోంది. ఆహారంతోపాటు పాలు కూడా ఇస్తోంది. వానరం తీరును చూసి అక్కడి ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ దృశ్యాలు సైతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.