టీనేజ్ వ్యాక్సినేషన్.. టీకా కేంద్రాల్లో పిల్లల సందడి.. - చిన్నారులకు వ్యాక్సినేషన్
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-14080263-thumbnail-3x2-vaccination.jpg)
Vaccination For 15 To 18 Years: దేశంలో 15-18 ఏళ్ల వయసు కలిగిన పిల్లలకు కొవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాల ప్రకారం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించాయి. ఇప్పటికే కోవిన్ పోర్టల్‌లో 12 లక్షలకు పైగా పిల్లలు తమ పేర్లను రిజిస్టర్ చేయించుకున్నారు. పిల్లల వ్యాక్సినేషన్ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ రాష్ట్రాలకు సూచించారు. నేరుగా వ్యాక్సిన్ కేంద్రాలకే వెళ్లి.. వాక్ ఇన్ రిజిస్ట్రేషన్ చేయించుకునే అవకాశం కల్పించారు. పాఠశాలలు, కళాశాలలకు వెళ్లిన విద్యార్థులు ఇళ్లకు తిరిగి వచ్చిన అనంతరం టీకాలు పొందేందుకు వీలుగా మధ్యాహ్నం 3 గంటల తర్వాత కూడా పంపిణీ కొనసాగించనున్నారు.