పులిని కర్రలతో కొట్టి చంపిన గ్రామస్థులు..! - దాడి

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 26, 2019, 4:01 PM IST

ఉత్తరప్రదేశ్‌లోని పిలిబిత్ జిల్లాలో ఓ పులిని గ్రామస్థులు కర్రలతో కొట్టి చంపారు. పిలిబిత్‌ టైగర్‌ రిజర్వ్‌కు సమీపంలోని మతైన గ్రామంలోకి బుధవారం ఓ పులి ప్రవేశించింది. 9 మందిపై దాడి చేసి గాయపర్చింది. ఆగ్రహించిన గ్రామస్థులు కర్రలతో పులిని వెంబడిస్తూ చితకబాదారు. దారుణంగా గాయపడిన పులి చనిపోయింది. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. స్పందించిన అటవీ శాఖ అధికారులు 31మంది గ్రామస్థులపై కేసు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.