మంచు దారిలో.. గర్భిణీకి సైనికుల సాయం - మంచు దారిలో గర్భిణీని మోసిన సైనికులు
🎬 Watch Now: Feature Video
జమ్ముకశ్మీర్ కుప్వారాలోని ఓ గర్భిణీకి సాయం చేసేందుకు సైనికులు ముందుకొచ్చారు. లోలబ్ రోడ్డు మంచుతో నిండిపోగా.. వాహనాలు రాకపోకలు సాగించలేని పరిస్థితి. ఈ క్రమంలో గర్భిణీని మంచంపై ఐదు కి.మీల దూరం మోసుకువెళ్లారు జవాన్లు. ఆమెను ఓ కారు వద్దకు చేర్చి, అనంతరం అక్కడి నుంచి ఆసుపత్రికి తరలించారు.