వింత ఆచారం.. ఆవులతో తొక్కించుకున్న యువకులు - ఉజ్జయినీలో ఆవులతో తొక్కించుకునే ఆచారం
🎬 Watch Now: Feature Video
సంప్రదాయం పేరుతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో వింత ఆచారాలు ఇప్పటికీ ఉన్నాయి. సంప్రదాయాల్లో భాగంగా చేసే పనులతో ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసినా.. వాటిని ఆచరిస్తున్నారు. ఇలాంటి ఘటనే మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో వెలుగు చూసింది. దీపావళి రోజున కొందరు యువకులు ప్రాణాలను కూడా లెక్కచేయకుండా.. కిందపడుకుని గ్రామంలోని ఆవుల మందతో తొక్కించుకున్నారు. కోరికలు నిరవేరుతాయనే ఆశతో ఈ సాహసానికి ఒడిగట్టారు. ఇది ఇక్కడ తరతరాలుగా వస్తున్న సంప్రదాయమని స్థానికులు చెబుతున్నారు. ఆవులతో తొక్కించుకోవడం వల్ల ఇన్నేళ్లలో తమకు ఎలాంటి ప్రమాదాలు జరగలేదని అంటున్నారు.