Viral Video: చెలరేగిన దొంగలు.. తుపాకులతో బెదిరించి దుకాణం లూటీ - దిల్లీ వార్తలు
🎬 Watch Now: Feature Video
దిల్లీలో ముగ్గురు దుండగులు రెచ్చిపోయారు. ఓ హార్డ్వేర్ షాపులోకి తుపాకులతో చొరబడి లూటీ చేశారు. కస్టమర్లను కూడా బెదిరించారు. యజమాని తలకు గన్ ఎక్కుపెట్టి అందినకాడికి దోచుకుపోయారు. ఖేరా ఖుర్ద్ ప్రాంతంలో శనివారం రాత్రి 8 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ చోరీకి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. దుండగుల్లో ఒకరు ఒక బుల్లెట్ పేల్చారని పోలీసులు తెలిపారు. హెల్మెట్, ముసుగు ధరించి ఉన్న వీరిని గుర్తించేందుకు పాత నేరస్థుల రికార్డులు తిరగేస్తున్నట్లు తెలిపారు.
Last Updated : Sep 5, 2021, 1:04 PM IST