Live video: అకస్మాత్తుగా కారు డోర్ ఓపెన్.. బైక్పై ఉన్న వ్యక్తి క్షణాల్లోనే... - పుణె ప్రమాదం
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-13657073-606-13657073-1637134270824.jpg)
మహారాష్ట్ర, ఫుణెలోని పింపరీ చించవాడలో ఒళ్లు గగుర్పొడిచే రీతిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు డ్రైవర్, ద్విచక్రవాహనదారుడి నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది. రాంగ్ రూట్లో కారు నిలపటమే కాకుండా.. అకస్మాత్తుగా డోర్ తెరిచాడు డ్రైవర్. అదే సమయంలో రాంగ్ రూట్లో కారును దాటేందుకు ప్రయత్నిస్తూ.. డోరు తగిలి ఎదురుగా వస్తున్న లారీకింద పడింది బైక్. ట్రక్కు టైర్ ఎక్కటం వల్ల ద్విచక్రవాహనంపై వెనక కూర్చున్న రామ్ బలాసాహెబ్ బగల్(24) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ నడుపుతున్న వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటన నవంబర్ 11న మధ్యహ్నం 1.30 గంటలకు జరిగింది. సీసీటీవీలో ఈ ప్రమాద దృశ్యాలు రికార్డయ్యాయి. ట్రక్కు, కారు డ్రైవర్లతో పాటు ద్విచక్రవాహనదారునిపైనా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.
Last Updated : Nov 17, 2021, 2:54 PM IST