బియ్యం బస్తా మోసిన తహసీల్దార్... ఎందుకంటే..? - floods
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-4161053-959-4161053-1566036944860.jpg)
టీ షర్టు ధరించి తలపై బియ్యం బస్తా, చేతిలో సంచులు మోస్తూ వంతెన దాటుతున్న వ్యక్తి... ఓ తహసీల్దార్. పేరు గణపతి శాస్త్రి. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా బెళ్తంగడి తాలూకా బాధ్యతలు పర్యవేక్షిస్తారు. వరదలతో అతలాకుతలమైన బెళ్తంగడి గ్రామ ప్రజలకు సాయం అందించేందుకు ఇలా తానే స్వయంగా రంగంలోకి దిగారు. వాగుపై నిర్మించిన తాత్కాలిక వంతెనపై అటూఇటూ తిరుగుతూ బాధితులకు సహాయ సామగ్రి అందించారు.
Last Updated : Sep 27, 2019, 7:24 AM IST