రేషన్ అడిగినందుకు రౌడీలతో డీలర్ దాడి - ఛతర్‌పుర్ వార్తలు
🎬 Watch Now: Feature Video
తనకు రావాల్సిన రెండు నెలల రేషన్ అడిగినందుకు ఓ యువకుడిని చితకబాదాడు రేషన్ డీలర్. ఈ ఘటన మధ్యప్రదేశ్ ఛతర్పుర్లోని భజ్నా పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. తపారియా గ్రామానికి చెందిన కమలేశ్ యాదవ్.. రేషన్ కోసం పక్కనే ఉన్న మజౌరా గ్రామానికి వెళ్లాడు. కమలేశ్‌కు రెండునెలల రేషన్ రావాల్సి ఉండగా.. డీలర్ మాత్రం ఒకనెలకు మాత్రమే ఇచ్చాడు. దీంతో కమలేశ్ ఆందోళనకు దిగాడు. డీలర్.. రేషన్ సరిగ్గా ఇవ్వటం లేదని ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో రౌడీలతో కలిసిన డీలర్.. కమలేశ్‌ను చితకబాదాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం.. డీలర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.