తండ్రి వెంటే తనయుడు.. నీట మునిగి అనంతలోకాలకు - మొహగావ్ జిల్పీ ప్రాంతం
🎬 Watch Now: Feature Video
పుట్టినరోజు వేడుకలు ఓ కుటుంబంలో పెను విషాదాన్ని నింపాయి. ప్రమాదవశాత్తూ నీట మునిగి తండ్రీకొడుకులు(12 ఏళ్ల బాలుడు) మరణించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చనిపోయిన వ్యక్తి చిన్న కుమారుని పుట్టినరోజు వేడుకల కోసం కుటుంబంతో కలసి మహారాష్ట్ర నాగ్పూర్ సమీపంలోని మొహగావ్ జిల్పీ ప్రాంతానికి విహారయాత్రకు వెళ్లగా.. ఈ విషాదం జరిగింది. ఘటనలో మృతుడి భార్య త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. ఏప్రిల్ 17న జరిగిన ఈ ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.