కరోనా నియంత్రణకు పట్నాయక్ 'సైకత' సందేశం - Padmashri award winner Sudarsan Pattnaik
🎬 Watch Now: Feature Video
కరోనా వైరస్‌పై అవగాహన కల్పించేందుకు తనవంతు ప్రయత్నం చేస్తున్నారు ప్రఖ్యాత అంతర్జాతీయ సైకత శిల్పి, పద్మశ్రీ అవార్డు గ్రహీత సుదర్శన్ పట్నాయక్. మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రతి ఒక్కరూ సబ్బుతో చేతులను శుభ్రం చేసుకోవాలనే సందేశాన్ని ఒడిశా పూరీ సముద్ర తీరంలో సైకత శిల్పం ద్వారా తెలియజేశారు. అతిగా భయపడొద్దని, మన దరికి చేరకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.