శబరిమల ఆలయానికి పోటెత్తిన భక్తులు - శబరిమల ఆలయం
🎬 Watch Now: Feature Video
శబరిమల ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. అయ్యప్పస్మామి దర్శనానికి శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల నుంచే భక్తులు పోటెత్తారు. అయ్యప్పమాలలో ఇరుముడితో ఆలయానికి చేరుకున్న భక్తులు.. స్వామిని దర్శించుకుంటున్నారు. మకరవిళక్కు ఉత్సవాల సందర్భంగా శబరిమల ఆలయాన్ని నిర్వహకులు ఇటీవలే తెరిచారు. జనవరి 14న మకరజ్యోతి దర్శనం తర్వాత.. 19న ఆలయాన్ని మళ్లీ మూసివేస్తారు.