దీపోత్సవానికి సుందరంగా ముస్తాబవుతోన్న అయోధ్య - అయోధ్య దీపోత్సవం
🎬 Watch Now: Feature Video

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య.. దీపావళికి అంగరంగ వైభవంగా ముస్తాబవుతోంది. రామ్ కీ పైడీలో భారీ ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం 5.5 లక్షల దీపాలు వెలిగించనున్నారు. ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం ఈ దీపోత్సవాన్ని ఏర్పాటు చేస్తోంది. కరోనా వల్ల అయోధ్యకు రాలేని వారు వర్చువల్ లైట్ వెలిగించవచ్చని ప్రభుత్వం సూచించింది. ప్రత్యేక దీపాలతో అలంకరించిన అయోధ్య.. మిరుమిట్లు గొలిపే కాంతితో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.