వారితో కలిసి సీఎం భాంగ్రా డ్యాన్స్ - భాంగ్రా డ్యాన్స్ న్యూస్
🎬 Watch Now: Feature Video
పంజాబ్ సీఎం చరణ్‌జీత్ సింగ్ చన్నీ (Charanjit Singh Channi).. ఓ కార్యక్రమంలో భాంగ్రా డ్యాన్స్‌తో అదరగొట్టారు. కపుర్థలాలోని పంజాబ్ టెక్నికల్ యూనివర్సిటీలో (Punjab Technical University) నిర్వహించిన రాష్ట్రస్థాయి మెగా ఉద్యోగమేళా ముగింపు సమావేశం, బీఆర్ అంబేడ్కర్ మ్యూజియం భూమి పూజలో చన్నీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కళాకారులతో కలిసి కాలు కదిపారు. ఈ దృశ్యాలను పంజాబ్ ప్రజా సంబంధాల విభాగం విడుదల చేసింది.