పోలీసునే కొట్టిన మద్యం ముఠా.. మామూలుగా కాదు! - హరిద్వార్
🎬 Watch Now: Feature Video
ఉత్తరాఖండ్ హరిద్వార్‌లో మద్యం మాఫియా గ్యాంగ్ రెచ్చిపోయింది. స్కూటీపై అక్రమంగా మద్యం తరలిస్తుండగా ప్రశ్నించిన పోలీసుపై దాడికి పాల్పడ్డారు 8 మంది దుండగులు. పోలీసుపై పిడిగుద్దుల వర్షం కురిపించి చొక్కా చించేశారు. మంగళవారం రాత్రి రానీపుర్లో ఈ ఘటన జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు.