ETV Bharat / state

సంక్రాంతి బాదుడు : ఊరెళ్లాలంటే జేబు ఖాళీ కావాల్సిందే! - SPECIAL BUSES FOR SANKRANTHI

సంక్రాంతి పండుగకు ఊరెళ్లే వారి జేబులు గుళ్ల! - ఆర్టీసీ బస్సుల్లో 50 శాతం రేట్లు పెంపు - ప్రైవేట్ ట్రావెల్స్​లో నాలుగింతలు పెంపు

Special Buses for Sankranthi
Extra Charges in Special Buses for Sankranthi (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 11, 2025, 7:58 AM IST

Extra Charges in Special Buses for Sankranthi : సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు పట్టణాల్లోని వారంతా పల్లెలకు చేరుతారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఈ రోజు శనివారం ఆఫీసులకు సెలవు రావడంతో అందరూ సంక్రాంతికి ఊర్లకు బయలు దేరుతున్నారు. ముఖ్యంగా నగరంలో ఉంటున్న ఏపీ వారు తప్పకుండా ఊరెళ్తారు. దీంతో నగరంలోని రోడ్లన్నీ రద్దీగా మారాయి. కానీ బస్సుల్లో ఊరెళ్లే వారికి చుక్కలు కనిపిస్తున్నాయి. అటు ఆర్టీసీ ప్రత్యేక ఛార్జీలు అంటూ ధరలు పెంచడం, ఇటు రైళ్లలో మూడు నెలల ముందే బుక్​ అయిపోవడంతో చాలా మంది ప్రైవేట్ ట్రావెల్స్ వైపు చూస్తున్నారు. దీంతో ఇదే అదునుగా ప్రైవేట్ ట్రావెల్స్ అధికంగా ధరలు పెంచాయి.

భారీగా పెంచిన బస్సు చార్జీలు : విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం, తిరుపతి తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల చార్జీలు భారీగా పెంచారు. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి గరిష్టంగా రూ. 4వేలు, విశాఖపట్నంకు రూ.6వేలు వసూలు చేస్తున్నారు. ఆదిలాబాద్​కు గరిష్టంగా రూ.5,000వేల నుంచి 6,000వేలకు టికెట్ ఛార్జీలు ఉన్నాయి.

ఏపీఎస్​ఆర్టీసీలో సాధారణ ఛార్జీలే : టీజీఎస్​ఆర్టీసీ ప్రత్యేక ఛార్జీలతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. సాధారణ చార్జీలే అంటూ ఏపీఎస్ ఆర్టీసీ స్పష్టం చేయగా.. టీజీఎస్​ఆర్టీసీ మాత్రం 50 శాతం అదనపు చార్జీలు వసూలు చేయడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీఎస్​ఆర్టీసీలో సాధారణ చార్జీలే ఉండటంతో ఏపీ వెళ్లేవారంతా ఆ బస్సుల వైపే మొగ్గుచూపుతున్నారు. సంక్రాంతికి ప్రయాణికుల కోసం టీజీఎస్​ఆర్టీసీ 6,432 బస్సులను నడుపుతుండగా.. ఏపీఎస్​ఆర్టీసీ 7,200 బస్సులను నడుపుతుంది. సింహభాగం హైదరాబాద్ నుంచే ఉన్నాయి. ఈ నెల 11,12 తేదీల్లో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక బస్సులను సిద్ధంగా ఉంచారు. సాధారణ ఛార్జీలున్న బస్సులు తక్కువగా నడపడంపై ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

జేబీఎస్​లో ప్రయాణికుల రద్ధీ : టికెట్ బుకింగ్ కోసం ప్రయత్నిస్తే ప్రత్యేక బస్సుల్లో 30 నుంచి 50 శాతం అదనపు చార్జీలు దర్శనమిస్తున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు. విజయవాడకు సూపర్ లగ్జరీ బస్సులో సాధారణ ధర 440 ఉండగా స్పెషల్ బస్సులో గరిష్టంగా 660 ఉంది. హైదరాబాద్ నుంచి ఊర్లకు వెళ్లే ప్రత్యేక బస్సుల్లో ప్రస్తుత చార్జీపై 50 శాతం వరకు టికెట్ల రేట్లు పెరిగాయి. నగరవాసులు ఈ బస్సులు బుక్ చేసుకుందామని ప్రయత్నిస్తే ఒకట్రెండు సీట్ల కంటే ఎక్కువ దొరకట్లేదు. దీంతో ప్రైవేట్ ట్రావెల్స్​పైనే ఆధారపడాల్సి వస్తుంది.

పెరిగిన విమాన చార్జీలు : పండుగ నేపథ్యంలో ఏపీలోని పలు ప్రాంతాలకు వెళ్లే విమానాలు చార్జీలు అధికంగా ఉన్నాయి. శుక్రవారం పది గంటల ప్రాంతంలో హైదరాబాద్ నుంచి విజయవాడకు విమాన చార్జీలు రూ.14 వేలకు పైనే ఉంది. అదే రాజమండ్రికి రూ.22 వేలు ఉంది.

సంక్రాంతి ప్రయాణికులకు శుభవార్త​ - ఆ మార్గాల్లో అదనంగా 1030 బస్సులు

సంక్రాంతికి 6,432 ప్రత్యేక బస్సులు - ఆ తేదీల్లో నడపనున్నట్లు టీజీఎస్ ​ఆర్టీసీ వెల్లడి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.