ETV Bharat / state

రోడ్డు పక్కన పొలంలో నోట్ల కట్టల సంచి - తెరిచి చూస్తే అన్నీ రూ.500 నోట్లే! - FAKE CURRENCY IN AGRICULTURE LAND

నల్గొండ జిల్లాలో నకిలీ నోట్ల కలకలం - ఓ రైతు పొలంలో సుమారు 40 వరకు రూ.500 నోట్ల కట్టలు

Fake Currency In NALGONDA
Fake Currency In Agriculture Land (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 25, 2025, 7:58 AM IST

Fake Currency In Agriculture Land : కొంత మంది తక్కువ సమయంలో పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాలనే ఆశతో పక్కదారి పడుతుంటారు. దొంగతనాలు చేయడం, డ్రగ్స్ అమ్మడం, దొంగ నోట్లు ముద్రించి దందా ఇలాంటివి నిత్యం ఏదో మూల నుంచి వింటూనే ఉంటాం. తాజాగా నల్గొండ జిల్లా దామరచర్ల మండలంలో పొలంలో నకిలీ నోట్లు దొరకడం కలకలం సృష్టించింది.

పొలంలో నకిలీ కరెన్సీ నోట్ల కట్టలు : దామరచర్ల మండలంలో ఓ పొలంలో అచ్చుగుద్దినట్టుగా అసలు నోట్లను పోలిన నకిలీ కరెన్సీ నోట్ల కట్టలు పడేసి ఉన్నాయి. నార్కట్‌పల్లి-అద్దంకి రాష్ట్ర రహదారి వెంబడి బొత్తలపాలెం వద్ద ఉన్న ఓ రైతు పొలంలో సుమారు 40 వరకు రూ.500 నోట్ల కట్టలు పేర్చి ఉన్న సంచి పడి ఉండటాన్ని స్థానిక రైతులు సోమవారం ఉదయం గుర్తించారు. కొన్నింటిని తీసుకెళ్లారు. విషయం పోలీసుల వరకూ వెళ్లడంతో మిర్యాలగూడ గ్రామీణ సీఐ వీరబాబు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మిగిలిన నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నారు. ఆ నోట్లపై ‘చిల్డ్రన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా’ అని ముద్రించి ఉన్నట్టు గుర్తించారు. అవన్నీ నకిలీ నోట్లేనని, ఈ నోట్లు అక్కడికి ఎలా వచ్చాయనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. వాటిని ఎందుకు వినియోగిస్తున్నారనేది విచారణలో తేలుతుందన్నారు.

మార్కెట్​లోకి నకిలీ రూ.200 నోట్లు - అచ్చుగుద్దినట్లు కలర్ జిరాక్స్

మందుబాబుకు దొంగనోటు కట్టబెట్టిన వైన్స్‌ సిబ్బంది.. నిలదీసే సరికి..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.