ETV Bharat / business

బీ అలర్ట్- కార్‌ జీవిత కాలాన్ని తగ్గించే 19 చెడు అలవాట్లు ఇవే! - BAD HABITS THAT KILL YOUR CAR

కార్‌ జీవిత కాలాన్ని తగ్గించే చెడు అలవాట్లు ఇవిగో- ఇంజిన్ ఆయిల్ నుంచి క్లచ్ పెడల్ దాకా ఈ విషయాలు తెలుసుకోండి!

Bad Habits That Might Kill Your Car
Bad Habits That Might Kill Your Car (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 25, 2025, 8:06 AM IST

Bad Habits That Kill Your Car : ఇల్లు అలకగానే పండగైపోదు అన్నట్టుగా, కారును కొనగానే పనైపోదు! దానిలోని ప్రతీ భాగాన్ని సరిగ్గా, సమర్థవంతంగా నిర్వహించాలి. అప్పుడే పూర్తిస్థాయి జీవిత కాలాన్ని కారు అందిస్తుంది. సకాలంలో సరైన మెయింటెనెన్స్ చేయకపోతే, దీర్ఘకాలంలో కారుకు భారీగా రిపేర్లు చేయాల్సిన దుస్థితి దాపురిస్తుంది. ఆ భారీ రిపేరింగ్ ఖర్చులను భరించలేక, కారును తుక్కులో పడేసే వాళ్లు కూడా చాలా మందే ఉన్నారు. కొన్ని చిన్నచిన్న చిట్కాలను పాటించి, కారును కండీషన్‌లో ఉంచుకుంటే ఈ పరిస్థితి రానే రాదు. కార్ల ధరలు, పెట్రోలు/డీజిల్ ధరలు, ఇంటి ఖర్చులు బాగా పెరిగిపోయాయి. ఇలాంటి తరుణంలో ఉన్న కారునే సరిగ్గా నిర్వహించుకోవడం తప్ప మరో ఉత్తమ మార్గం లేదు. కారు జీవిత కాలం పెరగాలంటే ఏమేం చేయకూడదో ఈ కథనంలో మనం తెలుసుకుందాం.

  1. 'ఆయిల్ లైట్' ఆన్‌లో ఉండగా డ్రైవింగ్ : కారులో కొన్ని వార్నింగ్ లైట్లు ఉంటాయి. వాటిలో కొన్నింటిని పెద్దగా పట్టించుకోనక్కర లేదు. అయితే రెడ్ ఆయిల్ లైట్‌ను మాత్రం విస్మరించవద్దు. దాన్ని వీలైనంత త్వరగా ఆపేయండి. ఇంజిన్ నడుస్తుండగా ఈ లైట్ వస్తే, వెంటనే కారును ఆఫ్ చేయండి. కారులో ఇంజిన్ ఆయిల్ ఎంత ఉందనేది తనిఖీ చేయండి. ఎంతైతే అవసరమో అంతమేర ఇంజిన్ ఆయిల్‌ను వేయించండి. కొన్నిసార్లు ఆయిల్ యూనిట్లలో తప్పిదాల వల్ల కూడా రెడ్ ఆయిల్ లైట్ వస్తుంటుంది. అలా అని దీన్ని పట్టించుకోకుండా వదిలేయవద్దు.
  2. ట్యాంక్ ఖాళీ : కారులోని ఇంధనం పూర్తిగా అయిపోయే దాకా నడపడం సరికాదు. అలా చేస్తే చెత్తాచెదారాలు దాని ఇంధన సరఫరా వ్యవస్థలోకి చేరిపోతాయి. కొంత ఇంధనం మిగిలి ఉండగానే, ట్యాంకును ఫిల్ చేసుకుంటే మంచిది. ఇంధన ట్యాంకులో కనీసం పావు వంతు భాగం నిండి ఉండగానే, మరింత ఇంధనాన్ని ఫిల్ చేయించుకోవాలి. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే కారులోని ఫ్యూయెల్ ఇంజెక్షన్ వ్యవస్థను రెండుగా చేసేందుకు మెకానిక్‌ను అనుమతించాలి.
  3. కారు నిత్యం కవర్‌లోనే : కారును కవర్‌లో ఉంచడం మంచి పద్ధతే. అయితే దాన్నే అలవాటుగా మార్చుకోవద్దు. కవర్ నిత్యం కారుపైనే ఉంటే, అది కారులో తేమను పెంచుతుంది. ఫలితంగా అది తుప్పు పట్టే అవకాశాలు పెరుగుతాయి. ఈ ప్రభావంతో దీర్ఘకాలంలో కారు జీవిత కాలం తగ్గిపోతుంది.
  4. తుప్పు పడుతుంటే చూస్తూ కూర్చొని : కారు ఏదైనా సరే, సరైన నిర్వహణ లేకపోతే తుప్పు పడుతుంది. తుప్పు పట్టే భాగాలను గుర్తించి, వీలైనంత త్వరగా రిపేర్ చేయించుకోవాలి. కారులోని కార్పెట్ కింది భాగంలో, డ్రైవర్ పాదాలు పెట్టే భాగంలో ఏర్పడే తుప్పు ప్రస్తుతానికి పెద్ద ముప్పుగా కనిపించదు. కానీ కాలక్రమంలో దానికి భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది. తుప్పును తొలగించేందుకు అయ్యే ఖర్చులు తక్కువే ఉంటాయి. చిన్నపాటి వ్యయంతో పెద్ద ఖర్చును తప్పించుకోవడమే మంచిది.
  5. తప్పుడు ఇంధనం : కొన్ని కార్లు డీజిల్‌తో నడుస్తాయి. ఇంకొన్ని కార్లు పెట్రోలుతో నడుస్తాయి. కారు కంపెనీ సూచించిన ఇంధనాన్ని మాత్రమే వినియోగించండి. ఒక ఇంధనం బదులు, మరొక ఇంధనాన్ని అస్సలు వాడవద్దు. పొరపాటున అలా చేసినా కారు ఇంజిన్ ఘోరంగా దెబ్బతింటుంది. ఆ తర్వాత కారు రిపేరింగ్ ఖర్చులు తడిసి మోపెడు అవుతాయి.
  6. మెయింటెనెన్స్ గాలికి వదిలేయడం : కారు జీవిత కాలం పెరగాలంటే, దాన్ని సరిగ్గా నిర్వహించాలి. ఈ వివరాలు తెలియాలంటే మీరు ఓనర్స్ మాన్యువల్ చదవాలి. ఆన్‌లైన్‌లో కూడా ఈ సమాచారం లభిస్తుంది. ఆయిల్ మార్చడం, కారులోని బెల్టుల ఫ్లూయిడ్స్, బ్రేక్‌ల ఫ్లూయిడ్స్‌పై సంపూర్ణ ఇన్ఫర్మేషన్ వాటిలో ఉంటుంది. సకాలంలో అవన్నీ చేయించండి. లేదంటే కారు లైఫ్ టైం తగ్గిపోతుంది.
  7. లీకులను పట్టించుకోకపోవడం : కారును మనం పార్క్ చేసినప్పుడు, దాని కింది భాగాన్ని కూడా నిశితంగా పరిశీలించాలి. ఏదైనా భాగం నుంచి ఆయిల్స్ కానీ, ఫ్లూయిడ్స్ కానీ లీకవుతున్నాయా అనేది గుర్తించాలి. ఎక్కడి నుంచైతే లీకేజీలు జరుగుతున్నాయో, అక్కడ రిపేరింగ్ చేయించాలి. సాధారణంగా కారు నుంచి ఆయిల్స్, కూలాంట్స్ లీక్ అవుతుంటాయి. వీటన్నింటిలో బ్రేక్ ఫ్లూయిడ్ అనేది డేంజరస్.
  8. క్లచ్‌ పెడల్‌పై పాదాలు : చాలా మంది కారు క్లచ్ పెడల్‌పై నుంచి పాదాలను కదపకుండా డ్రైవింగ్ చేస్తుంటారు. గేర్లను మార్చని సమయంలో క్లచ్ పెడల్‌పై పాదాలను ఉంచడం మంచిది కాదు. గేర్లను మార్చే క్రమంలో మన పాదాల వల్ల క్లచ్ పెడల్ చిన్నపాటి ఒత్తిడి పడినా దాని ఒత్తిడిని ఇంజిన్ ఫీలవుతుంది.
  9. ఎడతెరిపి లేని వినియోగం : కనీస మెయింటెనెన్స్ చేయకుండా, కారును ఎడతెరిపి లేకుండా నెలల తరబడి వినియోగించడం మంచిది కాదు. దీనివల్ల కారు ఇంజిన్‌లోని సీల్స్ పొడిబారుతాయి. దీనివల్ల ఇంజిన్ నుంచి లీకేజీ మొదలవుతుంది. ఒకవేళ కారు తలుపులు, కిటికీల సమీపంలో అలాంటివి కనిపిస్తే తుడిచేయండి. సూర్యరశ్మి ప్రభావం కారు లోపలి భాగాలపై పడుతుంది. కొన్నిసార్లు ఇంజిన్ సీజ్ అయిపోయే ముప్పు ఉంటుంది.
  10. అతిగా లాగడం/ఎత్తడం : కారును అతిగా లాగడం కానీ, ఎత్తడం కానీ మంచిది కాదు. మితిమీరిన సార్లు ఇలా చేస్తే కారు తట్టుకోలేదు. దీని వల్ల కారు డ్రైవింగ్ శైలి దెబ్బతింటుంది. సస్పెన్షన్ విభాగం, ఛాసిస్ దెబ్బతింటాయి. పెద్ద వాహనాన్ని చిన్నవాహనాలను లాగి తీసుకెళ్లే ప్రయత్నం చేయవద్దు. ఇతరుల వాహనాలను మీ కారుతో లాగి తీసుకెళ్లే యత్నం చేయొద్దు. మీ కారు మాన్యువల్ చదువుకోండి. అందులో నిర్దేశించిన పరిమితికి మించిన బరువు ఉండే వాహనాన్ని మీ కారుకు తగిలించి లాక్కెళ్లకండి.
  11. తప్పుడు ఆయిల్స్ వినియోగం : ఇంజిన్ ఆయిల్ సరైనదే వాడండి. ఇంజిన్ సామర్థ్యానికి అనుగుణమైన ఆయిల్‌ను తీసుకోండి. లేదంటే దీర్ఘకాలంలో ఇంజిన్ దెబ్బతింటుంది. కారును మీరు ఏ టెంపరేచర్‌లో నడుపుతారు అనే అంశం ఆధారంగా ఇంజిన్ ‌ఆయిల్‌ను ఎంచుకోండి. ఒకవేళ మీ కారుకు సింథటిక్ ఆయిల్ అవసరమైతే, దాన్నే వాడండి.
  12. జాక్ పాయింట్లను వినియోగించకపోవడం : చాలా వరకు కార్లకు ఒక్కో వైపు రెండు చొప్పున జాక్ పాయింట్లు ఉంటాయి. ముందు వీల్ వెనుక భాగంలో ఒక జాక్ పాయింట్, వెనుక వీల్ ముందు భాగంలో మరొక జాక్ పాయింట్ ఉంటాయి. కారును సరిగ్గా పైకి లేపాలంటే ఈ జాక్ పాయింట్లనే వాడాలి. కారులోని వీల్స్‌ను మార్చే క్రమంలో ఇవి ఉపయోగపడతాయి. మరేదైనా చోట కారుకు హుక్‌ను తగిలించి, పైకి లేపితే లోపలి భాగాలు దెబ్బతింటాయి. ఈ విధంగా దెబ్బతిన్న కారును నడిపితే, డ్రైవర్ శరీరంపై ప్రతికూల ప్రభావం పడుతుంది.
  13. కూలింగ్ సిస్టమ్‌లో నీళ్లు మాత్రమే పోయడం : కార్‌లోని కూలింగ్ సిస్టమ్‌లో కొందరు ప్రతీసారి పూర్తిగా నీళ్లనే పోస్తుంటారు. ఇలా చేస్తే చలికాలంలో వాహనం ఫ్రీజ్ అవుతుంది. ఏడాదంతా తుప్పు పడుతుంది. కారు కంపెనీ సిఫార్సు చేసిన కూలాంట్‌ను వినియోగించాలి. దాన్ని నిర్ణీత మోతాదులో నీటితో కలిపి కారులోని కూలింగ్ సిస్టమ్‌కు అందించాలి. ఓనర్స్ మాన్యువల్‌లో దీని వివరాలు ఉంటాయి.
  14. వానల్లోనూ కిటికీలు తెరిచి ఉంచడం : కారులోని ఇంటీరియర్స్‌కు వర్షాకాలంలో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఆ సీజన్‌లో కారులోకి వాన నీరు చేరకుండా జాగ్రత్త పడాలి. కిటికీలు, సన్ రూఫ్‌లను మూసి ఉంచాలి. వర్షపు నీరు కారులో పడితే కార్పెట్, కిటికీల స్విచ్చులు వంటి చిన్నచిన్న భాగాలు పాడైపోతాయి.
  15. ఇంజిన్ ఓవర్ హీటైనా డ్రైవింగ్ : ఇంజిన్ అతిగా వేడెక్కితే కాసేపు డ్రైవింగ్ ఆపేయండి. ఇంజిన్‌లో నుంచి కూడా పొగలు వస్తున్నాయంటే అనుమానించండి. వార్నింగ్ లైట్ వెలిగినా అలర్ట్ అయిపోండి. ఏదో కాలుతున్నట్లు వాసన వచ్చినా డ్రైవింగ్ ఆపండి. ఇంజిన్ కాస్త చల్లబడిన తర్వాత డ్రైవింగ్ మళ్లీ మొదలుపెట్టండి.
  16. నీళ్ల నడుమ డ్రైవింగ్ : బాగా నీళ్లు పేరుకుపోయిన చోటు నుంచి కారును డ్రైవ్ చేయడం మంచిది కాదు. ఎందుకంటే ఆ నీళ్లు ఇంజిన్‌లోకి ప్రవేశించే ముప్పు ఉంటుంది. ప్రత్యేకించి ఎస్‌యూవీలకు ఈ విధమైన నీరు నిలిచిన ప్రదేశాలు డ్రైవింగ్‌కు అనుకూలం కావు. కారుకు స్నోర్కెల్‌ను అమర్చుకుంటే ఇలాంటి పరిస్థితుల్లో కొంత రక్షణ కల్పిస్తుంది.
  17. పదేపదే రివర్స్ : కారును పదేపదే రివర్స్‌లో నడపడం మంచిది కాదు. మీరు పూర్తిగా మూలలో ఉన్న సమయాల్లోనే ఈ ఆప్షన్‌ను వాడుకోండి. రివర్స్ మోడ్‌ను అతిగా వినియోగిస్తే కారు గేర్ బాక్స్ దెబ్బతింటుంది. ముందుకు నడుస్తున్న కారును, అకస్మాత్తుగా రివర్స్ చేయడం కూడా మంచిది కాదు.
  18. అతిగా మోడిఫికేషన్లు : చాలా మంది కార్లకు అతిగా మోడిఫికేషన్లు చేయిస్తుంటారు. దీనికి ఒక లిమిట్ అనేది పెట్టుకోవాలి. అధునాతన సౌండ్ సిస్టమ్‌ను పెట్టినంత మాత్రాన మీ కారు రీసేల్ వ్యాల్యూ పెరుగుతుందని అనుకోవద్దు. అతిగా మోడిఫికేషన్లు చేస్తే, దాన్ని రీసేల్ చేయడం కూడా కష్టతరంగా మారొచ్చు.
  19. నాసిరకం/చౌక ధరల పార్ట్‌ల వినియోగం : తక్కువ రేటుకు వచ్చే విడిభాగాలను కారులో ఫిట్ చేయిస్తే అంతే సంగతి. దాని జీవిత కాలం తగ్గిపోతుంది. కారులోని ఆయా నాసిరకం విడిభాగాల తరుగుదల వేగంగా జరిగిపోతుంది. నాణ్యమైన విడిభాగాలనే అమర్చుకోండి. లేదంటే లాంగ్ జర్నీలో సమస్యలు బయటపడతాయి. కారులోని ప్రయాణించే వాళ్లకు ముప్పును కొనితెస్తాయి.

ఎక్స్-షోరూం ధర Vs ఆన్-రోడ్ ధర- ఈ రెండింటి మధ్య తేడా ఏంటి?

మంచి మైలేజ్ ఇచ్చే స్కూటీ కొనాలా? రూ.1 లక్ష బడ్జెట్లోని టాప్‌-10 మోడల్స్ ఇవే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.