Visakha Court Verdict On Fun Bucket Bhargav Case : వీడియోల చిత్రీకరణ పేరిట బాలికను ప్రలోభపెట్టి, గర్భవతిని చేసిన కేసులో నేరం రుజువు కావడంతో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం పోక్సో న్యాయస్థానం ప్రత్యేక న్యాయమూర్తి జి.ఆనందిని శుక్రవారం తీర్పు వెలువరించారు. శిక్షతో పాటు బాధితురాలికి రూ.4 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించారు.
పోక్సో న్యాయస్థానం ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ బి.వి.ఆర్.మూర్తి తెలిపిన వివరాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్ విశాఖలోని పెందుర్తి ప్రాంతానికి చెందిన బాలిక (14)తో, నాయుడుతోటకు చెందిన చిప్పాడ భార్గవ్ అలియాస్ ఫన్ బకెట్ భార్గవ్ (27) వీడియోలు చేసి సోషల్ మీడియాలో పెట్టేవాడు. ఆ పరిచయంలో భాగంగానే అశ్లీల (అసభ్యకర) చిత్రాలు తీసి, వాటితో బెదిరించి లోబరుచుకున్నాడు. నిందితుడు పలుమార్లు అత్యాచారం చేయడంతో బాలిక గర్భం దాల్చింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె తల్లి, 2021 ఏప్రిల్‌లో పెందుర్తి పోలీసులకు కంప్లైంట్ చేసింది. దీంతో పోలీసులు నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరిచారు. సాక్ష్యాధారాలు పరిశీలించిన న్యాయమూర్తి పైవిధంగా శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.
'న్యూడ్ వీడియోలతో బెదిరించి రెండేళ్లుగా బలవంతంగా నాపై అత్యాచారం' : పీఎస్లో మహిళ ఫిర్యాదు