ETV Bharat / offbeat

కమ్మటి "గోంగూర పండుమిర్చి నిల్వ పచ్చడి" - ఈ లెక్కన పెడితే నిజంగా అమృతమే - ఏడాది నిల్వ! - GONGURA PANDUMIRCHI NILVA PACHADI

-గోంగూరతో అద్దిరిపోయే నిల్వ పచ్చడి -ఇలా చేస్తే వేడి వేడి అన్నంలోకి అదుర్స్​

How to Make Gongura Pandumirchi Pachadi
How to Make Gongura Pandumirchi Pachadi (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 14, 2025, 11:59 AM IST

Updated : Feb 14, 2025, 2:58 PM IST

How to Make Gongura Pandumirchi Pachadi : గోంగూర పేరు చెబితే చాలు నోట్లో నీళ్లు ఊరని తెలుగువారు ఉండరేమో. పచ్చడి, కూర, తొక్కు, నాన్​వెజ్​ వంటకాలు ఇలా గోంగూరతో ఏది వండినా అమృతమే. అందుకే చాలా మంది దీనిని ఆహారంలో భాగం చేసుకుంటారు. అయితే, గోంగూరతో ఎన్ని వంటలు వండినా, అందరికీ ఫేవరెట్​ అంటే గోంగూర పచ్చడి. అయితే ఆ గోంగూర పచ్చడి రుచిని మరింత పెంచేందుకు మీకోసం అద్దిరిపోయే రెసిపీ తీసుకొచ్చాం. అదే గోంగూర పండుమిర్చి పచ్చడి. ఇప్పుడు ఎలాగో మార్కెట్లో పండుమిర్చి దొరుకుతున్నాయి. కాబట్టి ఓసారి ఇలా పచ్చడి పెట్టుకుంటే రుచి అద్దిరిపోతుంది. పైగా ఈ కొలతలతో పెడితే సంవత్సరం పాటు నిల్వ. మరి లేట్​ చేయకుండా ఈ పచ్చడికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు:

  • పండు మిరపకాయలు - పావు కేజీ
  • గోంగూర ఆకులు - 400 గ్రాములు
  • మెంతులు - 1 టేబుల్​ స్పూన్​
  • జీలకర్ర - 1 టీ స్పూన్​
  • నూనె - పావు కప్పు
  • చింతపండు - 20 గ్రాములు
  • ఉప్పు - 75 గ్రాములు
  • పసుపు - అర టీ స్పూన్​
  • వెల్లుల్లి రెబ్బలు - పావు కప్పు

తాలింపు కోసం:

  • నూనె - 6 టేబుల్​ స్పూన్లు
  • ఆవాలు - 1 టీ స్పూన్​
  • జీలకర్ర - 1 టీ స్పూన్​
  • మినపప్పు - 1 టీ స్పూన్​
  • పచ్చి శనగపప్పు - 1 టీ స్పూన్​
  • ఎండు మిర్చి - 3
  • దంచిన వెల్లుల్లి రెబ్బలు - 4
  • కరివేపాకు - 2 రెమ్మలు
  • ఇంగువ - చిటికెడు

తయారీ విధానం:

  • పండు మిరపకాయలను శుభ్రంగా కడిగి, తడి లేకుండా ఓ పొడి క్లాత్​తో తుడుచుకోవాలి. ఆపై తొడిమలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్​ చేసుకోవాలి. చింతపండులో కూడా గింజలు, పీచు లేకుండా శుభ్రంగా తీసేసి పక్కన పెట్టాలి.
  • గోంగూరను కాడలు లేకుండా కేవలం ఆకులు మాత్రమే తీసుకుని శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత ఓ మెత్తటి క్లాత్​ మీద వేసి ఫ్యాన్​ గాలికి రాత్రి మొత్తం ఆరబెట్టుకోవాలి. గోంగూర, పండు మిర్చిలో కొంచెం తేమ ఉన్నా పచ్చడి ఎక్కువ రోజుల నిల్వ ఉండదు. ఈ విషయం గుర్తుంచుకుని వాటిలో తేమ లేకుండా చూసుకోవాలి.
  • స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి మెంతులు వేసి దోరగా వేయించుకోవాలి. మెంతులు వేగుతున్నప్పుడు జీలకర్ర వేసి మరోసారి వేయించుకుని స్టవ్​ ఆఫ్​ చేసి పక్కన పెట్టాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీజార్​ లోకి వేసుకుని మెత్తని పొడి చేసి పక్కన ఉంచాలి.
  • మరోసారి స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి నూనె పోసుకోవాలి. నూనె కాగిన తర్వాత చింతపండు, గోంగూర ఆకులు వేసి కలుపుతూ తేమ లేకుండా మగ్గించుకోవాలి. నూనెలో గోంగూర బాగా మగ్గిన తర్వాత స్టవ్​ ఆఫ్​ చేసి పూర్తిగా చల్లార్చుకోవాలి.
  • మిక్సీజార్​లోకి కట్​ చేసిన పండుమిర్చి ముక్కలు, ఉప్పు, పసుపు, వెల్లుల్లి రెబ్బలు వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్​ చేసుకోవాలి.
  • ఆ తర్వాత వేయించిన మెంతులు జీలకర్ర పొడి, పూర్తిగా చల్లారిన గోంగూర వేసి మరోసారి గ్రైండ్​ చేసుకోవాలి. ఇలా గ్రైండ్​ చేసుకున్న గోంగూర పచ్చడిని గాజు జార్​లో పెట్టి ఫ్రిజ్​లో స్టోర్​ చేసుకుంటే సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది.
  • ఈ పచ్చడి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కొద్దిగా తాలింపు పెట్టుకోవచ్చు. లేదంటే పచ్చడి మొత్తాన్ని ఒకేసారి తాలింపు పెట్టుకున్నా నిల్వ ఉంటుంది.
  • తాలింపు కోసం స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి నూనె పోసుకోవాలి. నూనె కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చి శనగపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి.
  • ఆ తర్వాత ఎండుమిర్చి, దంచిన వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి మరోసారి ఫ్రై చేయాలి. చివరగా ఇంగువ వేసి కలిపి స్టవ్​ ఆఫ్​ చేయాలి.
  • ఇందులోకి గోంగూర పచ్చడిని వేసి కలిపి పూర్తిగా చల్లారిన తర్వాత స్టోర్​ చేసుకుంటే అద్భుతంగా ఉండే గోంగూర పండుమిర్చి పచ్చడి రెడీ. వేడి వేడి అన్నంలో నెయ్యితో ఈ పచ్చడిని తింటే అమృతమే. నచ్చితే మీరూ ఓ సారి ట్రై చేయండి.

పక్కా పల్లెటూరి రుచిలో - నోరూరించే "గోంగూర పచ్చడి" - ఇలా ప్రిపేర్​ చేసుకుంటే వారం నిల్వ!

ఆంధ్రా "గోంగూర నువ్వుల పచ్చడి​" - ఈ ప్రిపరేషన్ స్టైలే కేక!

Last Updated : Feb 14, 2025, 2:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.