ETV Bharat / entertainment

క్రేజీ డైరెక్టర్​తో అజిత్ నెక్ట్స్ మూవీ- 'AK64' వర్కింగ్ టైటిల్​తో షూటింగ్! - AJITH AK 64 MOVIE

అజిత్ అప్​కమింగ్​ మూవీ కోసం స్టార్ డైరెక్టర్ - 'AK64' వర్కింగ్ టైటిల్​తో షూటింగ్!

AK 64 Movie
AK 64 Movie (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 14, 2025, 12:32 PM IST

AK 64 Movie : కోలీవుడ్ స్టార్ హీరో అజిత్‌ కుమార్‌ ఇటీవలే 'విడాముయార్చి' (తెలుగులో పట్టుదల) మూవీతో థియేటర్లలో సందడి చేశారు. మగిల్​ తిరుమేని తెరకెక్కించిన ఈ సినిమా ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇందులో హీరోయిన్​గా త్రిష నటించగా, అర్జున్, రెజీనా కీలక పాత్రలు పోషించారు. కాగా, ఇప్పుడు స్టార్ హీరో అజిత్ తదుపరి సినిమా గురించి ఓ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

క్రేజీ డైరెక్టర్​తో అజిత్
అజిత్ కుమార్ తన 64 సినిమాను కోలీవుడ్ క్రేజీ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్​తో చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ 'ఏకే 64' అనే వర్కింగ్ టైటిల్​తో తెరకెక్కనున్నట్లు సమాచారం. కాగా, ఇటీవల కాలంలో అజిత్ తన తదుపరి ప్రాజెక్ట్​ను నితిలన్ స్వామినాథన్​తో చేయబోతున్నారని వార్తలు వచ్చాయి. అలాగే ప్రశాంత్ నీల్, విష్ణువర్ధన్, వెంకట్ ప్రభు వంటి డైరెక్టర్లతో అజిత్ జతకట్టనున్నారని వార్తలు వెలువడ్డాయి. తాజాగా కార్తీక్ సుబ్బరాజ్​తో సినిమా చేయనున్నారని ఫిల్మ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

పాజిటివ్ టాక్
ఫిబ్రవరి 6న రిలీజైన అజిత్ విడాముయార్చి ప్రేక్షకులను ఆకట్టుకుంది. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా అజిత్ సరసన త్రిష నటించారు. కోలీవుడ్ యంగ్ హీరోయిన్ ప్రియ భవానీ శంకర్ , అర్జున్, రెజీనా కీలక పాత్రల్లో కనిపించి ఆకట్టుకున్నారు. లైకా సుబాస్కరన్ తన సొంత బ్యానర్ అయిన లైకా ప్రొడక్షన్స్ పై ఈ సినిమాను నిర్మించగా, మగిళ్‌ తిరుమేని దర్శకత్వం వహించారు.

అలాగే అజిత్‌ 'గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ' అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. 'విశాల్‌ ‘మార్క్‌ ఆంటోనీ'తో మంచి హిట్‌ అందుకున్న అధిక్‌ రవిచంద్రన్‌ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. అభినందన్‌ రామానుజం సినిమాటోగ్రాఫర్‌ గా పనిచేస్తున్నారు. మైత్రీమూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.

మరోవైపు కోలీవుడ్ స్టార్ సూర్య, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా సినిమా 'రెట్రో'. ఈ సినిమాను కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించారు. ఈ మూవీ మే1న ప్రేక్షకుల ముందుకు రానుంది.

అజిత్‌ దుబాయ్‌ కార్​ రేసింగ్‌ వీడియో రిలీజ్​- సూపర్ థ్రిల్లింగ్​గా విన్నింగ్ మూమెంట్స్​!

'దయచేసి నన్ను అలా పిలవొద్దు- చాలా ఇబ్బందిగా ఉంది'- ఫ్యాన్స్​కు అజిత్ ఓపెన్ లెటర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.