క్లాస్ రూంలోకి భారీ కొండచిలువ.. బెంచీల కింద నక్కి! - ఒడిశా మల్కాన్‌గిరి వార్తలు
🎬 Watch Now: Feature Video
క్లాస్‌రూంలో కొండచిలువ(Python) కనిపించడం.. విద్యార్థుల్లో కలకలం రేపింది. ఒడిశా మల్కాన్‌గిరిలోని(Odisha Malkangiri News) ఓ కళాశాలలో ఈ సంఘటన జరిగింది. బెంచీల కింద పెద్ద పాము పడుకుని ఉన్నట్లు గమనించిన విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. కళాశాల యాజమాన్యం వెంటనే.. స్నేక్ హెల్ప్‌లైన్ బృందానికి సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న సత్యజిత్ గౌడ నేతృత్వంలోని బృందం సభ్యులు.. కొండచిలువను జాగ్రత్తగా పట్టుకుని, సంచిలో వేశారు. ఈ కొండచిలువ(Python) ఆరు అడుగుల పొడవుతో, 15 కిలోల బరువు ఉన్నట్లు చెప్పారు.