వైరల్ వీడియో: ఆకాశంలో వింత కాంతి! - గుజరాత్ వైరల్ వీడియో

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 22, 2021, 8:16 PM IST

గుజరాత్‌లోని జునాగఢ్ నగరంలో సోమవారం రాత్రి 10 గంటలకు ఆకాశంలో వింత కాంతి కనిపించింది. అదేంటో.. ఎవరికీ అంతుబట్టలేదు. చాలా మంది మొబైల్ కెమెరాలకు పనిచెప్పారు. ఈ ఎగిరే వస్తువును చూసేందుకు చాలా మంది ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. రంగు రంగుల్లో మెరుస్తూ ఆ కాంతి కనిపించింది. అది ఉల్క కాదనీ.. ఉల్కే అయితే అంతసేపు ఆకాశంలో స్థిరంగా ఉండదని తేల్చారు. తారా జువ్వ కూడా క్షణాల్లో కింద పడిపోతుంది కాబట్టి అది తారాజువ్వ కూడా కాదని భావిస్తున్నారు. కొన్ని లైట్లతో ఉన్నట్లుగా కనిపించిన ఆ కాంతి ఆకాశంలో చక్కర్లు కొట్టింది. ఐతే ఇది అన్‌ఐడెంటిఫైడ్‌ ఫ్లైయింగ్ అబ్జెక్ట్‌..యూఎఫ్​ఓ కాదని నిపుణులు అంటున్నారు. ఏదైనా ఉపగ్రహం దిగువ భూ కక్ష్యలో పయనించడం వల్ల ఇలా కనిపించి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.