కేరళ: నీటిపై వాయువేగంతో దూసుకెళ్లిన బోట్లు - కేరళ
🎬 Watch Now: Feature Video
కేరళ అలెప్పీలోని పున్నమడ సరస్సులో 2019 నెహ్రూ బోట్ రేస్ పోటీలు అట్టహాసంగా సాగుతున్నాయి. వీటితో పాటు ఛాంపియన్స్ బోట్ లీగ్ (సీబీఎల్) కూడా మొదలైంది. చున్దన్ వల్లం, చురులన్ వల్లం, వెప్పు వల్లం సహా వివిధ రకాలకు చెందిన 79 పడవలు ఈ పోటీల్లో పాల్గొంటున్నాయి. నీటిపై బోట్లు వాయువేగంగా దుసుకెళుతున్న దృశ్యాలు వీక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
Last Updated : Sep 29, 2019, 1:06 AM IST