Viral video: లక్కీ మ్యాన్.. 15 సెకన్లలో రెండుసార్లు చావుకు దగ్గరగా... - వేగంగా దూసుకొచ్చిన బైక్
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-14173313-421-14173313-1642040784255.jpg)
ద్విచక్రవాహనంపై వేగంగా దూసుకొచ్చి త్రుటిలో ప్రాణాపయం నుంచి తప్పించుకున్నాడు ఓ వ్యక్తి. యూటర్న్ తీసుకుంటున్న బస్సును ఢీకొట్టబోయి కాస్తలో తప్పించుకున్నాడు. ఒళ్లు గగుర్పొడిచే ఈ సంఘటన కర్ణాటక, దక్షిణ కన్నడ జిల్లాలోని ఎలియరుపాడవు ప్రాంతంలో జరిగింది. స్కూటీపై వేగంగా దూసుకొస్తున్న క్రమంలో మూలమలుపు వద్ద ఓ బస్సు యూటర్న్ తీసుకుంది. దానిని తప్పించుకునే క్రమంలో నియంత్రణ కోల్పోయి.. బైక్ను రోడ్డు కిందకు దించి, పక్కనే ఉన్న దుకాణం, చెట్ల మధ్యలోంచి దూసుకెళ్లాడు. అతని వద్ద హెల్మెట్ ఉన్నా.. తలకి పెట్టుకోకుండా బైక్ నడపటం గమనార్హం. ఇదంతా కేవలం 15 సెకన్లలోనే జరిగిపోయింది. హెల్మెట్ కింద పడిపోయినా ఆగకుండా వెళ్లిపోయాడు. స్థానిక సీసీటీవీ కెమెరాలో నమోదైన ఈ దృశ్యాలు వైరల్గా మారాయి.
Last Updated : Jan 13, 2022, 5:38 PM IST