బావిలో పడ్డ శునకాన్ని రక్షించిన 'సాహస' మహిళ - మంగళూరు
🎬 Watch Now: Feature Video
కర్ణాటక మంగళూరులో 45 అడుగుల లోతున్న బావిలో పడ్డ శునకాన్ని రక్షించింది రజనీ శెట్టి అనే జంతు ప్రేమికురాలు. తాళ్ల సహాయంతో బావిలోకి దిగి.. తీవ్రంగా శ్రమించి దానిని బయటకు తీసింది. ఆమె ఇలాంటి సాహసాలు చేయడం ఇదే తొలిసారి కాదు. గతేడాది ఫిబ్రవరిలోనూ 30 అడుగుల బావిలో పడిన కుక్కను కాపాడింది. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అయింది. తన నిస్వార్థ సేవకు నెటిజన్ల నుంచి మెప్పుపొందింది. మంగళూరు బల్లాబాగ్లోని ఓ అద్దె ఇంట్లో ఉండే రజనీ.. ఎన్నో కుక్కలు, పిల్లులు, పక్షులను సాకుతోంది.