ఈశా: శివనామ స్మరణతో మార్మోగుతున్న మైదానం - Maha Shivaratri
🎬 Watch Now: Feature Video
తమిళనాడు కోయంబత్తూర్లో ఈశా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహా శివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. పలు పూజా కార్యక్రమాలు, ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు వెంకయ్య. ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకులు జగ్గీ వాసుదేవ్ రాసిన 'డెత్' పుస్తకాన్ని వెంకయ్య ఆవిష్కరించారు. సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రాంగణం నిండిపోయింది. శివనామ స్మరణతో మైదానం మార్మోగుతోంది. మహాశివుడి భారీ ప్రతిమ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజలు, నృత్యాలను ఆసక్తిగా తిలకిస్తున్నారు భక్త జనం.
Last Updated : Mar 2, 2020, 2:54 AM IST