కొవిడ్ కేర్ సెంటర్లో బాధితుల ఫ్లాష్ మాబ్! - corona patients flash mob in covid care center
🎬 Watch Now: Feature Video
కర్ణాటక బళ్లారిలో లక్షణాలు కనిపించకుండా కరోనాతో బాధపడుతున్న కొందరు.. వారు చికిత్స పొందుతున్న కొవిడ్ కేర్ సెంటర్లో ఫ్లాష్ మాబ్ నిర్వహించారు. బాధితులు మొదట... ఒక్కొక్కరుగా, తర్వాత బృందాలుగా నృత్యప్రదర్శనలో పాల్గొని.. కరోనాపై అవగాహన కల్పించారు. బాధితుల్లో ఆత్మస్థైర్యం నింపే ప్రయత్నం చేశారు. లక్షణాలేవీ లేని తాము ఆరోగ్యంగానే ఉన్నామని తెలియజేశారు. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.