'సైకత గణేశా' కరోనాతో పోరాడే శక్తినియ్యవయ్యా.. - vinayaka bsand art in puri beach
🎬 Watch Now: Feature Video
వినాయకచవితి శుభాకాంక్షలు తెలుపుతూ సైకత శిల్పాన్ని రూపొందించారు ప్రముఖ కళాకారుడు సుదర్శన్ పట్నాయక్. కరోనా బాధితులకు ప్లాస్మా దానం చేయాలని సందేశమిస్తూ ఒడిశా పూరీ బీచ్లో మూషిక సమేత గణనాథుడి ఇసుక శిల్పం రూపొందించారు. కరోనాతో పోరాడే శక్తిని ప్రసాదించమని విన్నవించుకున్నారు. వైరస్ వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు కరోనా జాగ్రత్తలు పాటిస్తూ పండుగ జరుపుకోవాలని సూచించారు సుదర్శన్.