Viral Video: యువకుడిని వెంటాడి తొక్కి చంపిన ఏనుగు - అసోం మోరాంగి జిల్లా ఏనుగు
🎬 Watch Now: Feature Video
అసోం గోలాఘాట్ జిల్లాలోని మోరాంగి ప్రాంతంలో ఓ ఏనుగు మనిషి ప్రాణాలు తీసింది. తేయాకు కార్మికులు పని ముగించుకొని ఇంటికి తిరిగి వస్తుండగా.. ఏనుగుల మంద రోడ్డు దాటుతోంది. ఈ సమయంలో కొంతమంది ఏనుగులను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు. చివరగా ఉన్న ఓ ఏనుగు ఒక్కసారిగా కూలీలపై తిరగబడింది. వారి వెంట పడి పరిగెత్తింది. ఈ క్రమంలో ఓ కూలీ కిందపడిపోయాడు. దీంతో ఆగ్రహంతో ఉన్న ఏనుగు ఆ వ్యక్తిని తన కాళ్లతో తొక్కిపడేసింది. బాధితుడిని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించాడు.