పాదచారిపైకి దూసుకెళ్లిన కారు- ఎగిరిపడ్డ బాధితుడు - పాదాచారుడిపైకి కారు
🎬 Watch Now: Feature Video
కర్ణాటక విజయపుర జిల్లాలో పాదచారుడిపైకి కారు దూసుకెళ్లింది. ఆ వ్యక్తి ఎగిరి కిందపడ్డాడు. ముద్దెబిహళ పట్టణం బిదరకుండి రహదారిపై ఈ ఘటన జరిగింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిపై దూసుకెళ్లిన కారు.. ఆగకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయింది. గాయపడిన బాధితుడికి ప్రాణాపాయం లేదని వైద్యులు స్పష్టం చేశారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. కారు ముద్దెబిహళకు చెందిన వ్యాపారవేత్తదిగా పోలీసులు అనుమానిస్తున్నారు.