లైవ్ వీడియో: భారీ వర్షాలకు విరిగిపడ్డ కొండచరియలు - సిమ్లాలో కొండచరియలు
🎬 Watch Now: Feature Video
హిమాచల్‌ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వానల కారణంగా ఆ రాష్ట్ర రాజధాని సిమ్లా భట్టాకుఫర్ ప్రాంతంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఫలితంగా కొండకు ఆనుకుని ఉన్న పలు దుకాణాలు నేలమట్టమయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను స్థానిక ప్రజలు తమ కెమెరాల్లో బంధించారు. ఇప్పుడు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.