లైవ్ వీడియో: ఆపిల్ తోటలను కప్పేసిన భారీ మంచు అల - మంచు చరియలు
🎬 Watch Now: Feature Video
మంచు చరియలు విరిగిపడటం వల్ల హిమాచల్‌ప్రదేశ్ కిన్నౌర్ జిల్లాలోని రిబ్బ గ్రామాన్ని తెల్లటి మంచు కప్పేసింది. గ్రామంలోని ఆపిల్ తోటలు, నివాస ప్రదేశాలు.. మంచు ముసుగులో చాలాసేపు కనుమరుగయ్యాయి. ఏటా శీతాకాలంలో మంచు చరియలు విరిగిపడటం వల్ల ఆపిల్ తోటలకు అపార నష్టం వాటిల్లుతోందని స్థానికులు వాపోయారు. అయితే ఈ సీజన్‌లో తొలిసారి విరిగిపడిన మంచు చరియల వల్ల అంతగా నష్టం సంభవించలేదని గ్రామస్థులు పేర్కొన్నారు.