నాలుగు కాళ్ల కోడిని చూద్దాం రారండి! - నాలుగు కాళ్ల కోడి

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 24, 2020, 7:35 PM IST

ఎప్పుడైనా నాలుగు కాళ్ల కోడిని చూశారా? అయితే కర్ణాటక హుబ్బళ్లిలోని కుషుగల్​ రోడ్డులో ఉన్న ఏ.హెచ్​. బన్కారా చికెన్ ​స్టాల్​కు వెళ్లాల్సిందే. ఆ దుకాణ యజమాని జహేద్​ హోల్​సేల్​గా కోడి పిల్లలను కొనుగోలు చేసి పెద్దయ్యాక వాటిని అమ్ముతుంటాడు. ఇటీవల ఆర్డర్​ ఇచ్చిన కోళ్లలో నాలుగు కాళ్ల పిల్ల ఉన్నట్లు గుర్తించాడు. ఆ వింత కోడిని 50 రోజులుగా సంరక్షించాడు. ఆ కోడి పెద్దదై చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం దాన్ని అమ్మకుండా తన షాప్​లో సందర్శనకు ఉంచాడు. ఇంకేముంది వ్యాపారం మూడు పూవులు ఆరు కాయలుగా సాగుతోంది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.