Financial Gift For Life Partner on Valentines Day : ప్రేమికుల రోజు ప్రేమికులు ఒకరికి మరొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. దంపతులూ ఈ ప్రత్యేక రోజు గుర్తుండేందుకు ప్రేమ కానుకలు ఇచ్చుకుంటారు. కానీ ఇక్కడ ఒక్క నిమిషం ఆలోచించి సాధారణ బహుమతులకు బదులుగా ఆర్థిక రక్షణను ఇస్తే ఎలా ఉంటుంది? ఇది కాస్త కొత్తగానే అనిపించవచ్చు కానీ ఇలా చేస్తే భవిష్యత్తుకు ఇది కచ్చితంగా ఓ భరోసానిస్తుందని అంటున్నారు ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ప్రెసిడెంట్ దిలీప్ కుమార్ విద్యార్థి. ఇంకా ఆయన ఏం సూచిస్తున్నారంటే?
ప్రేమికుల దినోత్సవం రోజున మీ భాగస్వామితో కలిసి ఒక ఉమ్మడి బ్యాంకు ఖాతాను ప్రారంభించండి. ఇది కచ్చితంగా ఒకరికి ఒకరు ఇచ్చుకునే గొప్ప బహుమతి.
చర్చించుకునేందు కాస్త సమయం : ఇద్దరూ కలిసి ఒక బడ్జెట్‌ను తయారు చేసుకోండి. ఇది అంత సరదాగా ఉండకపోవచ్చు. కానీ, ఇది మీ జీవితంపై రోజూ ప్రభావాన్ని చూపిస్తుంది. మీ భవిష్యత్తులో వెలుగులు నింపుతుంది. ఆచరణాత్మకంగా ఉండేలా దీన్ని రూపొందించుకోవాలి. ఇది మీరిద్దరూ కలిసి కూర్చొని, డబ్బు గురించి చర్చించుకునేందుకు కాస్త సమయం ఇస్తుంది. ఇదంతా సరదాగా సాగిపోతూనే, ఒక ఆలోచన రేకెత్తించేలా ఉండాలి.
సాధారణ బహుమతులు ఎప్పుడైనా ఇచ్చుకోవచ్చు. వీటికి బదులుగా జీవిత బీమా పాలసీలను బహుమతులుగా ఇచ్చుకునే ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుంది. ఇద్దరి పేరు మీదా కనీసం రూ.కోటికి తగ్గకుండా టర్మ్ పాలసీ ఉండాలి. లేదా వార్షికాదాయానికి 10 రెట్లకు మించి పాలసీ ఉండాలి.
అనేక పాలసీలు అందుబాటులో : మీ ప్రియమైన వారి ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందీ రాకుండా చూసుకోవాలి. ఇది ఒక కానుక కాదు, మీ జీవిత భాగస్వామి శ్రేయస్సుకు మీరిస్తున్న ప్రాధాన్యం అనుకోవచ్చు. అనేక పాలసీలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో మీకు అనువైనది ఎంచుకోండి. రోజుకు 10 వేల అడుగులు నడవడం, 300 క్యాలరీలను ఖర్చు చేయడం లాంటి ఆరోగ్యకరమైన అలవాట్లు ఉన్నవారికి ఆరోగ్య బీమా ప్రీమియంలో 10 శాతం రాయితీ లభిస్తోంది. ఇలాంటి వాటిని ఎంచుకోవచ్చు.
అన్నింటిపైనా చర్చలు : ప్రత్యేకమైన రోజున పెట్టుబడుల గురించి ఏం మాట్లాడతాం? అనే ప్రశ్న రావచ్చు. కానీ, దీర్ఘకాలంలో ఆర్థిక భవిష్యత్తును సృష్టించుకోవాలంటే ఇది తప్పనిసరి. మ్యూచువల్ ఫండ్లు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఇలా వేటిలో పెట్టుబడి పెడితే మంచిదో నిర్ణయించుకోండి. ఎప్పుడు ఇల్లు కొనాలి, పిల్లలు, పదవీ విరమణ ప్రణాళికలు ఇలా అన్నింటిపైనా చర్చలు జరుపుతూ ఉండాలి
ఒకరికి తెలియని విషయాలు మరొకరు నేర్పాలి. ఆర్థిక అంశాలకూ ఇదే సూత్రం వర్తిస్తుందని గుర్తుంచుకోండి. డబ్బు నిర్వహణ, పెట్టుబడులు, ఖర్చుల నియంత్రణ ఇలా అన్ని విషయాల్లోనూ ఒకరికి ఒకరు సహాయం చేసుకోండి.
వాలంటైన్స్ డే స్పెషల్ : మీ ప్రేయసితో కలిసి ఈ కల్ట్ క్లాసిక్స్‌ను ఓసారి రీవైండ్ చేయండి!
వాలెంటైన్ డే స్పెషల్ సాంగ్స్- మీ పార్ట్‌నర్‌కి ఓ పాట డెడికేట్ చేసేయండి!
"మీ వాలెంటైన్"కు విషెస్ చెప్పండిలా - స్పెషల్ ఫేస్బుక్ & వాట్సాప్ స్టేటస్