హైవేపై ఏనుగు- రెండు గంటలపాటు ట్రాఫిక్ జాం - హరియాణా ఏనుగు
🎬 Watch Now: Feature Video
హరియాణాలోని కలేసర్ అటవీ పార్కు నుంచి ఓ ఏనుగు.. యమునా నగర్- పోంటీ సాహెబ్ రహదారిపైకి వచ్చింది. దొరికిన ఆకులను తింటూ.. చాలాసేపు రోడ్డుపైనే సందడి చేసింది. ఒక్కసారిగా రహదారిపై ఏనుగును గమనించిన వాహనదారులు.. భయంతో ఏనుగు అడవిలోకి వెళ్లేంతవరకు రోడ్డుపక్కనే వాహనాలను నిలిపివేశారు. గజరాజును వీడియో తీశారు. ఫలితంగా దాదాపు రెండు గంటలపాటు ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జాం అయింది.