ఏనుగుని కాల్చాడు.. ఉద్యోగం పోగొట్టుకున్నాడు!
🎬 Watch Now: Feature Video
కర్ణాటక బందీపుర్లో అభంశుభం తెలియని ఓ ఏనుగుపై కాల్పులు జరిపి ఉద్యోగం పోగొట్టుకున్నాడు అటవీ శాఖ తాత్కాలిక ఉద్యోగి రహీమ్. దారి తప్పివచ్చిన ఏనుగును తిరిగి అడవిలోకి పంపించాల్సిందిపోయి.. ఆపద సమయాల్లో మాత్రమే ఉపయోగించాల్సిన తుపాకీతో కాల్పులు జరిపాడు. నొప్పితో ఏనుగు విలవిల్లాడుతుంటే.. రాక్షసంగా నవ్వుతూ ఆనందించాడు. ఈ అమానవీయ ఘటనను వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశాడు మరో ఉద్యోగి ఉమేశ్. విషయం అధికారుల దృష్టికి వెళ్లగానే చర్యలు చేపట్టారు. రహీమ్ను విధుల నుంచి తప్పించారు. శాశ్వత ఉద్యోగి అయిన ఉమేశ్పై విచారణకు ఆదేశించారు.