National Technovation Celebrations 2024 in MGIT Hyderabad : ఏటా లక్షలాది మంది విద్యార్థులు ఇంజినీరింగ్ పూర్తి చేసినా ఉద్యోగావకాశాలు భారీగా ఉన్నా కొందరే జాబ్స్ సాధించగలుగుతుంటారు. కారణం పరిశ్రమల అవసరాలకు తగినట్లు అభ్యర్థుల్లో నైపుణ్యాలు లేకపోవడం. అందుకే విద్యార్థులు ఆవిష్కరణలు చేసేలా వారిలో సృజనాత్మక పెంపొందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి పలు విద్యాసంస్థలు. హైదరాబాద్‌లోని మహాత్మా గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ క్యాంపస్ ఇలాంటి జాతీయస్థాయి టెక్నోవేషన్‌లకే వేదికైంది. మరి ఆ విశేషాలేంటో ఈ కథనంలో చూద్దాం.
విద్యార్థులు కళాశాల స్థాయిలోనే ఆవిష్కరణలపై దృష్టి సారించడం ద్వారా నైపుణ్యాలతో పాటు ఉద్యోగవకాశాలు సులువుగా అందిపుచ్చుకుంటారు. దీనికోసం పలు ప్రముఖ విద్యాసంస్థలు క్యాంపస్‌లోనే ప్రత్యేక శిక్షణ, వర్క్‌షాప్‌లు ఏర్పాటు చేసి విద్యార్థులను ప్రోత్సహిస్తున్నాయి. నిపుణులతో సూచనలు, సలహాలు ఇప్పిస్తూ వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి.
సృజనాత్మకతను పెంపొందించేందుకు : హైదరాబాద్ ఎంజీఐటీ విద్యాసంస్థలో నిర్వహించిన జాతీయస్థాయి టెక్నోవేషన్ వేడుకలో వివిధ కళాశాలలకు చెందిన 500 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. రోబోటిక్స్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ ఇలా 11 విభాగాలకు చెందిన ఎన్నో ఆవిష్కరణలను విద్యార్థులు బృందాలుగా ఏర్పడి ప్రదర్శించారు. స్టూడెంట్స్‌లో సృజనాత్మకతను పెంపొందించే ప్రయత్నం చేస్తున్నామని చెబుతున్నాడు కళాశాల ప్రిన్సిపల్ చంద్రమోహన్ రెడ్డి.
కారులో క్లచ్ లేకుండా సులభంగా గేర్ మార్చేందుకు మెకానికల్ ఇంజినీరింగ్ చదువుతున్న ఆటోమేటిక్ రోటరీ గేర్‌ను విద్యార్థులు కనుగొన్నారు. ఆటోమేటిక్ రోటరీ గేర్‌ను ఆరుగురు బృందంగా కలిసి చేశామన్నా రు. ఈ ఆవిష్కరణను తయారు చేసేందుకు 10 రోజులు వరకు సమయం పట్టిందని చెబుతున్నాడు వర్ధన్.
'ఇలాంటి టెక్ ఫెస్టులు పిల్లల టాలెంట్‌ను బయటికి తీయడానికి ఉపయోగపడతాయి. విద్యార్థుల్లోని సృజనాత్మకతను బయటకు తీసి సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లకు సొల్యూషన్స్ తీసుకొస్తారు. ఇలాంటి ప్రాజెక్టులు చేసి, అలా స్టార్టప్‌లు మొదలు పెడతారు. చాలా ప్రోగ్రామ్స్‌లో విద్యార్థులు అవార్డులు గెలుచుకుంటున్నారు.' - చంద్రమోహన్ రెడ్డి, ఎంజీఐటీ ప్రిన్సిపల్
మూవబుల్ బ్యాటరీ వీల్‌చైర్ : సాధారణంగా వీల్ చైర్ అంటే చాలా స్థలం ఆక్రమిస్తుంది. ఎక్కడికైనా తరలించాలంటే మరొకరి సాయం అవసరమవుతుంది. ప్రత్యమ్నాయంగా ఎక్కడికైనా సులువుగా తీసుకెళ్లేందుకు మూవబుల్ బ్యాటరీ వీల్‌చైర్ తయారు చేశాడు మెకానికల్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ అభిరామ్.
పరిశ్రమల్లో జరిగే అగ్నిప్రమాదాలను త్వరగా కనిపెట్టేందుకు ఎయిర్ రోబో ల్యాండ్ రోవర్ కనిపెట్టారు విద్యార్థులు. తాము చేసిన పరికరం ఆటోమెటిక్‌గా పనిచేస్తూ ప్రతిక్షణం సమాచారం పంపిస్తుందని ప్రమాదం జరిగితే వెంటనే హెచ్చరిస్తుందని చెబుతున్నాడు అనూప్.
సొంతంగా డ్రోన్‌ల తయారీ : మరికొందరు విద్యార్థులు ఎత్తుపల్లాలను సులభంగా ఎక్కేందుకు స్టెయిర్ క్లైంబింగ్ రోబోట్‌ను కనుగొన్నారు. ఇస్రో, నాసాను ఆదర్శంగా తీసుకుని ఈ పరికరం తయారు చేశామని చెబుతున్నా రు. ప్రస్తుతం వ్యవసాయం నుంచి ఫోటోగ్రఫీ వరకు వాడుతున్న డ్రోన్‌లను విద్యార్థులు సొంతగా చేసి ప్రదర్శించారు. తక్కువ ఖర్చుతో తయారు చేసి అందరికీ అందించే ప్రయత్నం చేస్తామని చెబుతున్నాడు బద్రీనాథ్.
"నేను స్టేయిర్ క్లయింబింగ్ రిపోర్ట్‌ను తయారు చేశాను. ఎత్తుపళ్లాలు ఉన్న ప్లేస్‌లలో ఇది ఉపయోగపడుతుంది. రోబో అది అంతలా పని చేసేలా ప్రొగ్రామింగ్ చేసి పెట్టాము. ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మాకు ఏదైనా చేయాలి అన్న ఆసక్తి పెరుగుతోంది." - భరద్వాజ్, ఇంజినీరింగ్ విద్యార్థి
పరిశ్రమల్లో వినియోగించే లోహాలపై అందరి అవగాహన కోసం ప్రదర్శించామన్నారు విద్యార్థులు. లోహ పదార్థాలు వివిధ పరిశ్రమల్లో, పరిశోదనల్లో ఉపయోగిస్తారని చెబుతున్నాడు సొహెల్. ఈ విద్యార్థులంతా కొత్త ఆవిష్కరణలతో ప్రతిభ చాటుతూ తమ తోటివారికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
YUVA : ఆనందాలు, ఆవిష్కరణలకు కేరాఫ్ 'అట్మాస్-2024' - వచ్చేసిందోచ్