ETV Bharat / offbeat

వావ్ అనిపించే రెస్టారెంట్ స్టైల్ "చిల్లీ గార్లిక్ చికెన్" - ఈజీగా చేసుకోండిలా! - టేస్ట్ అదుర్స్! - CHILLI GARLIC CHICKEN RECIPE

చికెన్​తో ఎప్పుడూ రొటీన్ రెసిపీలే కాదు - ఓసారి ఈ సూపర్ రెసిపీని ట్రై చేయండి!

Garlic Chicken Recipe
Chilli Garlic Chicken Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 28, 2024, 3:34 PM IST

Chilli Garlic Chicken Recipe : చికెన్ అంటే ఎంత ఇష్టమైనా సరే.. ఎప్పుడూ ఒకటే తరహాలో తినాలంటే బోర్ కొడుతుంది. అందుకే మీకోసం ఒక సూపర్ రెసిపీ తీసుకొచ్చాం. అదే.. రెస్టారెంట్ స్టైల్ "చిల్లీ గార్లిక్ చికెన్". టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. వేడి వేడి అన్నం, రోటీలు, పులావ్.. ఇలా దేంతో తిన్నా కాంబినేషన్ అద్దిరిపోతుంది! పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తింటారు. పైగా దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సులువు! మరి, ఈ సూపర్ టేస్టీ రెసిపీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా తయారుచేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

మారినేషన్ కోసం :

  • బోన్​లెస్ చికెన్ - 450 గ్రాములు
  • ఉప్పు - అరటీస్పూన్
  • మిరియాల పొడి - అరటీస్పూన్
  • డార్క్ సోయా సాస్ - 1 టీస్పూన్
  • ఒక గుడ్డు తెల్లసొన
  • కార్న్​ ఫ్లోర్ - 4 టేబుల్​స్పూన్లు
  • ఆయిల్ - 2 టీస్పూన్లు

సాస్ మిక్స్ కోసం :

  • రెడ్ చిల్లీ సాస్ - 2 టేబుల్​స్పూన్లు
  • టమాటా కెచప్ - 1 టేబుల్​స్పూన్
  • టమాటా ప్యూరీ - 4 టేబుల్​స్పూన్లు
  • సోయా సాస్ - 2 టేబుల్​స్పూన్లు
  • బ్రౌన్ షుగర్ - 2 టీస్పూన్లు
  • కార్న్ ఫ్లోర్ - 1 టేబుల్​స్పూన్
  • వాటర్ - 5 నుంచి 6 టేబుల్​స్పూన్లు

కర్రీ కోసం :

  • వెల్లుల్లి రెబ్బలు - 10
  • ఎండుమిర్చి - 4
  • పచ్చిమిర్చి - 4
  • స్ప్రింగ్ ఆనియన్ వైట్స్ - 3 నుంచి 4 టేబుల్​స్పూన్లు
  • ఆయిల్ - తగినంత
  • స్ప్రింగ్ ఆనియన్ తరుగు - 3 టేబుల్​స్పూన్లు(గార్నిష్ కోసం)

ఇంట్లోనే రెస్టారెంట్​ స్టైల్​ "చికెన్​ షేర్వా" - ఇలా చేస్తే ఘాటు నషాళానికి ఎక్కాల్సిందే!

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా బోన్​లెస్​ చికెన్​ని తినడానికి వీలుగా చిన్న చిన్న ​ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా కడగాలి.
  • ఆపై చికెన్​ని ఒక మిక్సింగ్ బౌల్​లోకి తీసుకొని అందులో మిరియాల పొడి, ఉప్పు, ఎగ్ వైట్, నూనె, డార్క్ సోయా సాస్, కార్న్​ఫ్లోర్ వేసి అన్నీ కలిసేలా మిక్స్ చేసుకొని ఒక అరగంటపాటు పక్కన ఉంచాలి.
  • ఈలోపు రెసిపీలోకి కావాల్సిన సాస్​ మిక్స్ ప్రిపేర్ చేసుకోవాలి. అందుకోసం ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో రెడ్ చిల్లీ సాస్, టమాటా కెచప్, టమాటా ప్యూరీ, సోయా సాస్, బ్రౌన్ షుగర్, కార్న్​ఫ్లోర్, వాటర్ వేసుకొని అన్నీ కలిసేలా బాగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి.
  • అనంతరం స్టౌపై పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక మారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసుకొని ఒక నిమిషం కదపకుండా ఉండాలి. ఆపై మీడియం ఫ్లేమ్ మీద గరిటెతో కలుపుతూ చికెన్ ముక్కలు బ్రౌన్​ కలర్​లోకి మారేంత వరకు వేయించుకోవాలి. తర్వాత వాటిని ఒక ప్లేట్​లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు రెసిపీలోకి కావాల్సిన స్ప్రింగ్ ఆనియన్ వైట్స్​ని చిన్న చిన్న ముక్కలుగా, పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. అలాగే వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీసి సన్నగా తరుక్కోవాలి.

ఒక్కసారి ఇలా "చికెన్ ఫ్రై" చేయండి - ఇంట్లో వాళ్లు ఎప్పుడూ అలాగే వండమనడం పక్కా!

  • అనంతరం స్టౌపై పాన్ పెట్టుకొని మూడు టేబుల్​స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. నూనె కాస్త వేడయ్యాక.. వెల్లుల్లి తరుగు వేసి 30 సెకన్ల పాటు వేయించాలి. ఆపై కట్ చేసి పక్కన పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్ వైట్స్, పచ్చిమిర్చితో పాటు ఎండుమిర్చిని ముక్కలుగా తుంపి వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి.
  • ఆవిధంగా వేయించుకున్నాక అందులో ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న సాస్​ మిక్స్, కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి వేసుకొని కలిపి లో ఫ్లేమ్ మీద 1 నుంచి 2 నిమిషాల పాటు ఉడికించాలి. అంటే.. మిశ్రమం కాస్త చిక్కగా మారేంత వరకు ఉడికించుకోవాలి.
  • అలా ఉడికించుకున్నాక ఆ మిశ్రమంలో ముందుగా వేయించుకున్న చికెన్ ముక్కలను వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత స్టౌను హై ఫ్లేమ్​లో ఉంచి 2 నిమిషాల పాటు వేయించుకోవాలి.
  • ఇక చివరగా స్ప్రింగ్ ఆనియన్స్ తరుగు వేసి కలిపి ఒక నిమిషం వేయించుకొని దింపేసుకుంటే చాలు. అంతే.. ఎంతో రుచికరంగా ఉండే "చిల్లీ గార్లిక్ చికెన్" రెడీ!

వింటర్​ స్పెషల్​ - యమ్మీ యమ్మీ "చికెన్​ సమోసా" - ఈవెనింగ్​ టైమ్​ పర్ఫెక్ట్​ స్నాక్​ - టేస్ట్​ అదుర్స్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.