Live video: వృద్ధుడిని కర్రలతో కొట్టి చంపిన దుండగులు - లైవ్​ వీడియో

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 14, 2022, 2:03 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ షాజహాన్​పుర్​లో దారుణ ఘటన వెలుగు చూసింది. సిధౌలీ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని పసిగనపుర్​ గ్రామంలో ఓ వృద్ధుడిని కర్రలతో చితకబాదారు ముగ్గురు దుండగులు. తీవ్ర గాయాలతో ఆ వృద్ధుడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్​ మీడియాలో పోస్ట్​ చేయగా వైరల్​గా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి.. ముగ్గురిపై హత్య కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితుడిని అరెస్ట్​ చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు చెప్పారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.