80ఏళ్ల వృద్ధురాలిపై దాడి- ఇల్లు ధ్వంసం.. అడ్డొచ్చిన కుక్కపైనా.. - old woman attacked tamil nadu
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-14038872-thumbnail-3x2-attack-on-old-woman.jpg)
Old woman attacked Madurai: తమిళనాడులో అమానవీయ ఘటన జరిగింది. వయసుకు సైతం గౌరవం ఇవ్వకుండా ఓ వృద్ధురాలిపై కర్కశంగా దాడి చేశారు కొందరు వ్యక్తులు. కర్రలతో తీవ్రంగా కొట్టారు. మధురైలోని కొట్టంపట్టిలో నివాసం ఉంటున్న లక్ష్మి(80)కి.. పొరుగింటి రాజంగంతో భూతగాదాలు ఉన్నాయి. దీనిపై ఇరువురి మధ్య తరచూ గొడవలు జరిగేవి. మంగళవారం ఈ వివాదం హద్దుమీరగా.. రాజంగం మరో నలుగురు వ్యక్తులతో కలిసి లక్ష్మి, ఆమె కుమార్తెపై కర్రలతో దాడి చేశాడు. లక్ష్మి పెంపుడు శునకం దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. దానిపైనా దుండగులు దాడి చేశారు. వృద్ధురాలి ఇంటినీ ధ్వంసం చేశారు. స్థానికులు ఈ వీడియో తీయగా.. దీని ఆధారంగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బాధితులు. దీనిపై కొట్టాంపట్టి పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.