ట్యాంకర్ నుంచి డీజిల్ లీక్- ఎగబడిన జనం! - మధ్యప్రదేశ్ బీతల్ జిల్లా వార్తలు
🎬 Watch Now: Feature Video
గుజరాత్ నుంచి ఛత్తీస్గఢ్వైపుగా వెళ్తున్న ఓ డీజిల్ ట్యాంకర్ మధ్యప్రదేశ్‌లోని బైతుల్-ఇందోర్ రహదారిపై ప్రమాదానికి గురైంది. అందులోని ఇంధనం లీక్ అవడం మొదలైంది. ఇది తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ట్యాంకు నుంచి వస్తున్న డీజిల్‌ను పట్టుకునేందుకు ప్లాస్టిక్ డబ్బాలు, క్యాన్లు వెంట తెచ్చుకున్నారు. ప్రమాదమని తెలిసినా.. లెక్కచేయకుండా డీజిల్ కోసం ఎగబడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.