కరోనాపై అవగాహనకు పోలీసుల 'డ్యాన్స్ బేబీ డ్యాన్స్' - police dance video viral in kerala
🎬 Watch Now: Feature Video
కరోనా వైరస్ దరి చేరనీయకుండా కేరళ పోలీసులు ప్రజలకు వినూత్నంగా అవగాహన కల్పిస్తున్నారు. చేతులు శుభ్రంగా కడుక్కోవాలంటూ డ్యాన్స్ చేస్తూ ఓ వీడియో రూపొందించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం అవుతోంది. అప్లోడ్ చేసిన ఒక్క రోజులోనే ఫేస్బుక్లో 8 లక్షల వీక్షణలు సొంతం చేసుకుంది. పోలీసుల చొరవను పలువురు అభినందిస్తున్నారు. నెటిజన్లయితే కామెంట్ల రూపంలో ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.